![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -640 లో...... బావతోనే గుడికి వెళ్లి మొక్కు చెల్లించుకుంటానని జ్యోత్స్న అనగానే పారిజాతం, దశరథ్ వద్దు ఈ రోజు కార్తీక్, దీప పెళ్లి రోజు కదా అని అంటారు. ఏమవుతుంది దానికి అసలే సెంటిమెంట్ త్వరగా వస్తారులే అని సుమిత్ర అనగానే జ్యోత్స్నని తీసుకొని కార్తీక్ బయల్దేరతాడు. గుడికి వెళ్ళాక కార్తీక్ కార్ దగ్గర ఉంటాడు. జ్యోత్స్న లోపలికి రమ్మంటే....మొక్కు నీది వెళ్లి త్వరగా రా అని కార్తీక్ అంటాడు. నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసని జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. వెళ్లి పూజారితో ఈ రోజు మా పెళ్లి రోజు నా భర్త నాపై అలిగి బయట ఉన్నాడు.. అతను వచ్చాక మీరు మా ఇద్దరి పేరున అర్చన చెయ్యండి అని జ్యోత్స్న అనగానే పూజారి సరే అంటాడు.
ఆ తర్వాత కార్తీక్ కి జ్యోత్స్న ఫోన్ చేసి కార్ లో పూలసజ్జ మర్చిపోయాను తీసుకొని రా బావ అంటుంది. నేను తీసుకొని రానని కార్తీక్ అనగానే మా అక్కకి చేప్తానని జ్యోత్స్న అనగానే కార్తీక్ తప్పక పట్టుకొని వస్తాడు. కార్తీక్ ని చూసి ఏంటయ్యా ఈ రోజు పెళ్లి రోజు పెట్టుకొని అలగడం ఏంటని అంటాడు. భార్యకి ఎవరైనా దూరంగా ఉంటారా అని అనగానే ఒక మహాతల్లి వల్ల దూరంగా ఉండడం జరిగిందని కార్తీక్ అంటాడు. నీ భార్య నీ పక్కనే ఉంది కదా అని పూజారి అనగానే నా భార్య తను కాదని కార్తీక్ అంటాడు. ఎంత గొడవ అయితే మాత్రం భార్య కాదంటావా అని పూజారి అంటాడు. అక్కడున్న కొంతమంది ఆడవాళ్లు అలా భార్యని భార్య కాదంటావా అని కార్తీక్ తో అంటారు. ఈవిడ నా భార్య అయితే తన మెడలో తాళి ఎక్కడ అని కార్తీక్ అంటాడు. అవును ఎక్కడ అని పూజరి అనగానే.. అప్పుడే దీపని తీసుకొని పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. నేను చెప్తాను పంతులు గారు ఈ రోజు వీళ్ళ పెళ్లిరోజు దీప, కార్తీక్ వీళ్ళ పేరున అర్చన చెయ్యండి.. తను శ్రీమతి కాదు కుమారి.. పెళ్లి కావట్లేదని గుళ్ల చుట్టూ తిరుగుతుందని జ్యోత్స్నని ఉద్దేశ్శించి పారిజాతం అనగానే జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నేను కరెక్ట్ చెప్పాను పంతులు గారు సరిగ్గా వినలేదని జ్యోత్స్న కవర్ చేసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గర దీప ఆశీర్వాదం తీసుకుంటుంది.
మరొకవైపు పారిజాతాన్ని శివన్నారాయణ పిలుస్తాడు. పిన్ని లేదు నాన్న.. దీపని తీసుకొని గుడికి వెళ్ళిందని దశరథ్ చెప్తాడు. జ్యోత్స్న ఏమైనా అంటుందేమో అని శివన్నారాయణ అంటాడు. అదేం లేదు.. కలిసి వెళ్ళలేదు కదా అని దశరథ్ అంటాడు. పారిజాతంలో మార్పు వచ్చింది జ్యోత్స్నలో మార్పు వచ్చిందని శివన్నారాయణ అనగానే అవును మావయ్య అని సుమిత్ర అంటుంది. మరొకవైపు నాకు అడ్డు వస్తున్నావని పారుపై జ్యోత్స్న సీరియస్ అవుతుంది. నువ్వు దీప జోలికి వస్తే ఊరుకోనని పారు అంటుంది. ఇక నేనంటే ఏంటో చూస్తావని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |